బీఆర్ఎస్లో చేరికల వెల్లువ
అందోల్ నియోజకవర్గంలో కొద్దిరోజులుగా కాంగ్రెస్,బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నెలకొంది.
- అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
- గులాబీ కండువాలు కప్పుకున్న శివంపేట, ఆర్.ఇటిక్యాల కాంగ్రెస్ నేతలు
- కాంగ్రెస్ పార్టీకి షాక్
- అభివృద్ధిని చూసి చేరినట్లు వెల్లడి
- సంక్షేమ పాలన మెచ్చే చేరికలు : ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
అందోల్ నియోజకవర్గంలో కొద్దిరోజులుగా కాంగ్రెస్,బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నెలకొంది. ఆదివారం శివంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80మంది ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలన మెచ్చి బీఆర్ఎస్లో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిపారు.
-అందోల్/ చౌటకూర్/వట్పల్లి,సెప్టెంబర్ 10
అందోల్/ చౌటకూర్, సెప్టెంబర్ 10: మండలంలోని శివంపేటకు చెందిన 80 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అలీం, మాజీ సర్పంచ్ దేవుని గోపాల్ ఆధ్వర్యంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలుచేస్తున్నదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించే పథకాలతో లబ్ధిపొందుతున్నదన్నారు.
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పార్టీ కోసం ప్రతికార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మాజీ వార్డు సభ్యులు బండని శంకరయ్య , ఈరగోటి ఆంజనేయులు, చాకలి గోపాల్, మాజీ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శివన్నపురం లక్ష్మయ్య, కోడూరి భుజం గం, పుట్టి యాదగిరి, పుట్టి పాపయ్య, చాకలి కృష్ణ, ఎండీ ఖదీర్, ఎండీ అజీజ్, బేగరి మల్లేశం, బేగరి నర్సింలు, కోడూరి సులోచన, మన్నె అంతమ్మ, అనంతపురం యాదమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి నాగులపల్లి శ్రీహరి, నాయకులు మిరియాల రాములు, మిరియాల గోపాల్, సదానందారెడ్డి, రాజేందర్, సంతోష్, రాజు, సునీల్, కలీల్, అఖిల్ యాదవ్, బాలు, నవీన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
వట్పల్లిలో..
వట్పల్లి, సెప్టెంబర్ 10: అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం పోతులబోగూడ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో రేగోడ్ మండలం ఆర్ ఇటిక్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారి కి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామా ల్లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో టేక్మల్ మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

