Over speed | అతివేగం నిండు ప్రాణాలు తీసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తిని మృత్యుఒడిలోకి తీసుకెళ్లింది. ఓ వ్యక్తి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కుల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
శ్రీధర్ అనే వ్యక్తి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్లో స్టిల్స్