Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీ రోల్ పోషిస్తోంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ నెట్టింటిని షేక్ చేస్తోంది.
పవన్ కల్యాణ్ స్టైలిష్ అవతార్‌ను చూసిఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్, అభిమానులు. సాంగ్ షూట్ సందర్భంగా లొకేషన్లో డైరెక్టర్ హరీష్ శంకర్తోసెల్ఫీ దిగాడు పవన్ కల్యాణ్. పక్కనే శ్రీలీలను కూడా చూడొచ్చు. ఈ సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
దేఖ్లేంగే సాలా సాంగ్ ను భాస్కర బట్ల రాయగా దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో విశాల్ దడ్లానీ పాడాడు. రంపంపం రంపంపం స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్ లేంగే సాలా సాంగ్ అంటూ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్‌లోని స్టైలిష్ డ్యాన్స్‌ను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు విజువల్స్ చెప్పేస్తున్నాయి.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న 2026కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దేఖ్ లెంగే సాలా… చూసినాంలే చాలా..
The first single #DekhlengeSaala from #UstadBhagatSingh is a #PawanKalyan fan-fest by Director Harish Shankar. Pawan Kalyan with killer dance moves, Bhaskara Bhatla’s lyrics pack a punch, Vishal Dadlani brings energetic vibes, and Devi Sri… pic.twitter.com/7zoOxWNtO4
— BA Raju’s Team (@baraju_SuperHit) December 13, 2025