నర్సాపూర్ : ఆరు గ్యారెంటీల లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ లంటూ హైడ్రామా చేసిందని మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం నర్సాపూర్ బిజెపి పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవో 9 చెల్లదని తెలిసి కూడా ఒక డ్రామా చేసిందన్నారు. ప్రజలను మోసం చేసి గెలిచిన ఆ పార్టీ ప్రచారానికి గ్రామాల్లోకి వెళితే ప్రజలు తిట్టిపోస్తారని రిజర్వేషన్ నాటకం ఆడిందన్నారు. బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, నారాయణ రెడ్డి, బాదే బాలరాజు, గుండం శంకర్, సంఘసాని రాజు, రామ్ రెడ్డి పాల్గొన్నారు.