Mallanna Gutta | వెల్దుర్తి : తెలంగాణ కాశీగా పేరు గాంచిన వెల్దుర్తి మండల పరిధిలోని బస్వాపూర్ శ్రీ భ్రమరాంబ సహిత మల్లిఖార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుట్ట) 48వ వార్షికోత్సవ ఉత్సవాలకు ముస్తాబైంది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను నిర్వహించడానికి ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు, భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలను కన్నుల పండుగగా చేయడానికి సర్వం సిద్దం చేశారు. ఉత్సవాల్లో భాగంగా శివ పార్వతుల కళ్యాణాన్ని వందలాది మంది భక్తుల నడుమ కన్నుల పండుగగా నిర్వహించనున్నారు.
ఎందరో సిద్దులు, ఋషులు నడయాడిన, ప్రసిద్ది చెందిన, మహిమ గల ఈ మల్లన్న గుట్ట దాతల సహకారంతో అభివృద్ది చెందుతూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతుంది. గుట్ట కింది భాగంలో పెద్ద రాతిబండ కింద స్వయంభూగా వెలిసిన పుట్టులింగం ఉండడంతో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ స్వయంభూ శివలింగం ప్రతి సంవత్సరం కొంత ఎత్తు పెరుగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయాన్ని మహాశిల్పి నాగయ్య నిర్మించగా, ఆలయం ప్రాంగణంలో పలువురు దాతల సహాకారంలో గణపతి, వీరంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగదేవతల ఆలయాలను, కళ్యాణ మంటపాన్ని, గదులను నిర్మించారు.
మహాశివుడికి పర్వదినమైన శివరాత్రితోపాటు శ్రావణం మాసం, కార్తిక మాసం, వార్షికోత్సవాల సందర్బాలతోపాటు ప్రతీ సోమవారం ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాలకు విశేషాలంకరణలు, ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. అలాగే ప్రతీ సోమవారం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని సైతం దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
నేటి నుండి 48వ వార్షికోత్సవాలు..
నేటి నుండి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మొదటి రోజైన నేడు కుకునూర్ ఆంజనేయస్వామి దేవాలయం నుండి జెండాను ఊరేగింపుగా తెచ్చి మల్లన్నగుట్ట వద్ద ప్రతిష్ట, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, ఆఖండ దీప స్థాసన, కలశస్థాపన, అగ్నిప్రతిష్ట, గణపతి, శ్రీరుద్ర, పురుషసూక్త, శ్రీ సూక్త, మన్యుసూక్త, ఆవాహిత దేవతా, మూలమంత్ర హోమము, బలి ప్రదానము, పూర్ణాహుతి చేపట్టనున్నారు.
రెండో రోజైన 27 గురువారం దేవతామూర్తులకు ఆభిషేకాలు, ప్రత్యేక పూజలు, శ్రీ భ్రమరాంబ సహిత మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణం, సాయంత్రం ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ, భోనాలు, 28 శుక్రవారం రథోత్సవం, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు ప్రతి రోజు రాత్రి భజనలు, సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?