Mahabhishekam | మెదక్ రూరల్, సెప్టెంబర్ 30 : హవేలీ ఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలోని వీధులు శివనామస్మరణతో మార్మోగిపోయాయి. మంగళవారం జక్కన్నపేటలో శివ లింగానికి మహా అభిషేకం నిర్వహించారు. పేరూరు సరస్వతీ మాత ఆలయ వ్యవస్థాపకులు రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో శివ నామస్మరణ చేశారు.
మహిళలు ఒకే రంగు చీరలు ధరించి అమ్మవారికి సామూహిక మంగళహారతులు ఇచ్చారు. అనంతరం మహిళలంతా పాటలు పాడుకుంటూ సామూహికంగా బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత అమ్మవారి సన్నిధిలో భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Karur stampede | కరూర్ తొక్కిసలాట.. యూట్యూబర్ అరెస్ట్
Gorati Venkanna | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
Urvashi Rautela | బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌతేలా