Machinery Equipments | రామాయంపేట, మార్చి 25 : ప్రభుత్వం మహిళా రైతులకు సబ్సీడీపై వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ పరికరాలను అందజేయనున్నట్లు రామాయంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ పేర్కొన్నారు. ఇవాళ రామాయంపేట వ్యవసాయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్టీయ స్వయం వికాస యోజన, సబ్మిషన్ అగ్రికల్చర్ మేకనైజేషన్లో భాగంగా మహిళలకు సబ్సీడీపై అందజేయనున్నట్లు తెలిపారు.
యంత్రాలు కావాలనుకునే మహిళా వ్యవసాయ రైతులు నేరుగా తమ ధరఖాస్తులను రామాయంపేటతోపాటు ఇతర డివిజన్‌కు సంబంధించిన మండలాల్లో అందజేయాలన్నారు. ఈ సబ్సిడీ యంత్రాలను వ్యవసాయ మహిళలకు 50శాతం, ఇతర రైతులకు అయితే 40శాతం సబ్సీడీ ఇస్తామన్నారు. రామాయంపేట మండలానికి 04 బ్యాటరీతో నడిచే చేతిపంపులు, మూడు తైవాన్ పంపులు, ఒక రొటోవేటర్ ఉన్నాయన్నారు.
షెడ్యూల్ కులాలకు చెందిన మహిళా రైతులకు మాత్రం ఒక ట్రాక్టర్, రెండు కల్టివేటర్లు, ఒకటి గట్టు చేసే యంత్రాలను ఇవ్వడం జరుగుతుంద న్నారు. మహిళా రైతులు తమ వ్యవసాయ పాస్‌బుక్, బ్యాంకు ఖాతా బుక్, ఆధార్ కార్డు జిరాక్సు కాపీలతో దరఖాస్తు చేయాలన్నారు. ట్రాక్టర్లను స్వయం సహాయక బృందాలు గాని, రైతుమిత్ర, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు రామాయంపేట వ్యవసాయ కార్యాలయంలో తెలుసుకోగలరు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?