DCCB Bank | పాపన్నపేట, జూలై 29 : రైతులతోపాటు అన్ని వర్గాల వారికి వివిధ రకాల రుణ సౌకర్యం కల్పిస్తున్నామని పాపన్నపేట డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ జాదవ్ కిషన్ పేర్కొన్నారు. మేనేజర్ జాదవ్ కిషన్ ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని మల్లంపేటలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాదవ్ కిషన్ మాట్లాడుతూ.. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే కలిగే లాభాలపై వివరించారు. అదేవిధంగా మహిళా సంఘాలకు రూ.20 లక్షల రుణాలు అందజేసినట్లు వెల్లడించారు. బంగారు ఆభరణాలపై ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే ఋణం అందజేస్తున్నామన్నారు. ముఖ్యంగా తమ బ్యాంకులో రైతులకు అన్ని రకాల లోన్లతోపాటు విద్యార్థులకు స్వదేశీ, విదేశీ విద్య, వాహన ఋణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే తమ బ్యాంకులో లాకర్ సౌకర్యం కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాపురెడ్డి, సాయినాథ్ రావు, బ్యాంకు సిబ్బంది నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
YS Jagan | రెడ్‌బుక్ తరహాలో వైసీపీ యాప్.. వాళ్లందరికీ సినిమా చూపిస్తానని వైఎస్ జగన్ వార్నింగ్
Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆపై రివర్స్‌లో వచ్చి వృద్ధుడ్ని ఢీ