Flood victims | మెదక్ రూరల్, సెప్టెంబర్ 09 : లయన్స్ క్లబ్ ఆఫ్ మెదక్ మంజీర ఆధ్వర్యంలో హవేళి ఘనపూర్ మండల పరిధిలోని దూప్‌సింగ్ తండా వాసులకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాదాపు 70మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. లయన్స్‌క్లబ్ మెదక్ ఆధ్వర్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాలో వరదలతో ఇబ్బందులు పడిన తండావాసులకు తమ క్లబ్ అండగా నిలుస్తుందన్నారు. త్వరలోనే మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని ముంపునకు గురైన బాధితులకు చేయూతనిచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలకు సేవలందించేందుకు లయన్స్‌క్లబ్ ఎప్పుడు అండగా నిలుస్తుందన్నారు.
పేదల ప్రజలకు సేవలందించేందుకు సభ్యులు సమిష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. క్లబ్ సభ్యుల సలహాలు, సూచనలు మేరకు రాబోయే రోజుల్లో తమ క్లబ్ మరిన్ని సేవలు చేసి ప్రజల మన్ననలు పొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బసవేశ్వరరావు, గంప రమేష్, వైస్ గవర్నర్ నర్సింహారాజు, ప్రవీణ్, పద్మావతి, సూర్యనారాయణ, రాయకంటి నాగరాజు, కిషన్గుప్త, లయన్స్ క్లబ్ మెదక్ మంజీరా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, కార్యదర్శి వెంకటరమణ, రాజు, నీలకంఠం, డాక్టర్ పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్