CITU | టేక్మాల్, అక్టోబర్ 21 : సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం పేర్కొన్నారు. టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికులతో సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ మహాసభలు డిసెంబర్ 7,8,9వ తేదీల్లో మెదక్ పట్టణంలో జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించే విధంగా చర్చలు జరుగుతాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై అవలంబిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయూ మాత్రమే పోరాడుతుందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇన్సూరెన్స్, టెలికాం రంగాలను ప్రైవేటుపరం చేస్తుందన్నారు. బ్యాంకుల్లో సైతం ప్రైవేట్ పెట్టుబడుదారులను పెద్ద ఎత్తున ఆహ్వానించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
పార్ట్ టైం ఉద్యోగుల గౌరవ వేతనం పెంచడం లేదు..
నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల పొట్ట కొట్టారని మల్లేశం గుర్తు చేశారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకుంటుందన్నారు. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు అనేక రంగాల పార్ట్ టైం ఉద్యోగుల గౌరవ వేతనం పెంచడం లేదన్నారు. హక్కుల కోసం ధర్నాలు చేసే వారిపై ఉక్కు పాదం మోపడం ఈ ప్రభుత్వాలకు అలవాటు అయిందని ఆయన విమర్శించారు.
సమ్మె చేయడం కార్మికుల హక్కు..దానిని ఎవరు హరించినాన పాతరేస్తామని మల్లేశం మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడం తెలంగాణ రాష్ట్రం మొత్తం కార్మికుల ప్రక్షాళ మాట్లాడే వారు డిసెంబర్ 7,8,9, తేదీలలో మెదక్ పట్టణంలో సమావేశమై పరిష్కరించే దిశగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షులు లాలు, ఆ సంఘం నాయకులు మల్లేష్, శ్రీనివాస్, సాయిలు, మర్పల్లి మల్లేశం, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!