నారాయణఖేడ్, ఆగస్టు 30: నారాయణఖేడ్ నియోజకవర్గం తొమ్మిదేండ్లలోనే ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే రావాల్సిన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలన్నారు. బుధవారం నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన ఝరుగొండ, రాంగొండ, మల్గొండ, హన్మంతు, సిద్దుగొండ, గణపతి, వెంకట్, మల్లేశ్, సుభాశ్, ప్రవీణ్, బస్గొండ, కల్గొండ, నవనాథ్, మాణిక్గొండ, మారుతిగొండ సహా 50 మందికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని విస్మరించి, స్వలాభం కోసం పని చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రతి లబ్ధిదారుడికి నేరుగా లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని అండగా ఉండాలని, నారాయణఖేడ్‌లో మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేసి చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, నాయకులు పార్శెట్టి సంగప్ప, గ్రామ పార్టీ అధ్యక్షుడు సంతోశ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, నవనాథ్, తుకారాం, రాంగొం డ తదితరులు పాల్గొన్నారు.
తుర్కవడగామలో..
కంగ్టి, ఆగస్టు 30: కాంగ్రెస్ దోచుకుని దాచుకున్నదే తప్పా ప్రజలకు చేసిందేమీ లేదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం కంగ్టి మండలం తుర్కవడగామలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 ఏండ్లు పాలించిన కాంగ్రె స్ నాయకులు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. దీంతో గ్రామాల్లో సమస్యలు తాండవించాయన్నారు. గ్రామాల్లో కనీసం అంతర్గత రోడ్లు కూడా ఉండేవి కావన్నారు. కిలోమీటర్ల మేర నడిచి, నీటిని మహిళలు మోసుకొచ్చేవారని గుర్తుచేశారు. 60 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కేవలం తుర్కవడగామ గ్రామంలో రూ.కోట్లాది నిధులు మంజూరు చేసి సీసీరోడ్లు, వాటర్‌ట్యాంక్, ఇంటింటికీ నల్లా కనెక్షన్, కమ్యూనిటీ భవనాలు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదన్నారు. రైతు సంక్షమమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, పంట రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ ఫలాల ను సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెబుతున్న కల్లబొల్లి మాటలు పట్టించుకోవద్దన్నారు. కర్ణాటక రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పటివరకు అక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. అంతకుముందు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, రూ.5 లక్షల నిధులతో మురుగు కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగీతా వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ లలితా ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగారం, సిర్గాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్‌రావు, నాయకులు సంతోశ్‌పాటిల్, బసప్ప, రాజ ప్ప, సతీశ్, దిలీప్, పవన్పాటిల్ పాల్గొన్నారు.