పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 9: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జడ్పీహెచ్ఎస్ను కబ్జా చేసేందుకే రాత్రికి రాత్రే కూల్చివేశారని మెదక్ ఎంపీ రఘునందర్రావు ఆరోపించారు. పటాన్చెరు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భవనాన్ని మంగళవారం రాత్రి కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం పాఠశాల భవనాన్ని నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
పటాన్చెరు ఐబీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ, అసైన్డ్, ప్రభుత్వ పాఠశాలల భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. పటాన్చెరు నడిబొడ్డులో సుమారు నాలుగు ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం 1962లో అప్పటి జిల్లా ఉన్నతాధికారులు రూ.10 వేలు మంజూరు చేసిన ప్రొసీడింగ్స్, 2009లో అప్పటి తహసీల్దార్ పాఠశాల ఉన్న భవనం, స్థల వివరాలను సర్వే చేసి ఇచ్చిన పంచనామా రిపోర్ట్‌ను ఎంపీ ప్రదర్శించారు.
1962కు ముందు నుంచే ఇక్కడ పాఠశాల ఉందన్నారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించిన తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం అశోక్‌కుమార్, జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్ స్వప్న రాజేందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు కుమార్, ఈర్ల రాజు, నర్సిగ్రావు తదితరులు పాల్గొన్నారు.