KanthaReddy Tirupathi Reddy| మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10 : బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆశీర్వదించారు. తిరుపతిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కేటీఆర్, హారీశ్‌రావులను హైదరాబాద్‌లోని వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా వారు కేక్ కట్ చేయించి తిరుపతిరెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తిరుపతిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు చంద్రమోహన్‌గౌడ్, నయీం, గౌష్ ఖురేషి, జయరాజు, మధు, కిరణ్, రాములు, నాగరాజు, సుఫీ, నవీన్, కిష్టయ్య, బాలేష్, రవీందర్, కిరణ్‌గౌడ్, మాయ మల్లేశం, ఆంజనేయులు, సతీష్‌రావు, రంజీత్, మంగ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.