మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), అక్టోబ ర్ 26: రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్‌ను మూడోసారి సీఎంను చేయడానికి ఎదురుచూస్తున్నారని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఖాజీపూర్ గ్రామ దాసరి కుల సం ఘం సభ్యులతో సమావేశమయ్యారు. దాసరి సంఘం కుల సభ్యులు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని సంయుక్తంగా ప్రకటించి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పత్రాన్ని ఆయనకు అందజేసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖాజీపూర్ గ్రామ దాసరి కుల సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మా నం చేయడం సంతోషంగా ఉందన్నారు. తనను గెలిపిస్తే మరింత సేవ చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమతామాధవ్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మీచిరంజీవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, పార్టీ మండల సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్, నాయకులు పరశురాములు, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్వామి, వీరయ్య, దాసరి కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.