దుబ్బాక, నవంబర్ 12: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతుల కోసం రూ.175 కోట్ల నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని వివిధ రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం బుధవారం హైదరాబాద్‌లోని రోడ్డు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, మున్సిపాలిటీ, పట్టణావృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీదేవీలను ఆయన కలిశారు.
నియోజకవర్గంలో పలు రహదారులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే బుధవారం రాత్రి దుబ్బాక విలేకరులకు ఫోన్ ద్వారా తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దుబ్బాక మున్సిపాలిటీకి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిందని గుర్తుచేశారు.