వికారాబాద్‌లో చెల్లని నోటు ఇక్కడ చెల్లుతుందా అని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు అన్నారు. గురువారం మండలంలోని సిద్ధ్దాపూర్ తండా, సేడియగుట్ట తండా, గొటిగార్‌పల్లి, బడంపేట, పర్సపల్లి, ఖానాపూర్, కొత్తూర్ గ్రామాల్లో ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్, బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ.. వికారాబాద్ బీజేపీ నాయకుడిని తీసుకొచ్చి జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం స్థానికులను అవమానించడమే అన్నారు. స్థానికుడిగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని ప్రజలను ఆయన కోరారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కోహీర్, అక్టోబర్ 19 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. గురువారం మండలంలోని సిద్దాపూర్ తండా, సేడియగుట్ట తండా, గొటిగార్‌పల్లి, బడంపేట, పర్సపల్లి, ఖానాపూర్, కొత్తూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజల అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు. కానీ, మరోసారి అవకాశం కావాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. అవకాశం ఇచ్చినప్పుడూ ఏమాత్రం పట్టించుకోని పార్టీ మరోసారి అధికారం కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వికారాబాద్‌లోని బీజేపీ నాయకుడిని తీసుకువచ్చి జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. స్థానికులకు కాకుండా వేరే ప్రాంతం వాళ్లకు టికెట్ కేటాయించడం ఇక్కడి దళితులకు అవమానకరమన్నారు. వికారాబద్లో చెల్లని నోటు ఇక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, నిరంతర కరెంటు అప్పుడు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల అభివృద్ధి గురించి పని చేస్తుందన్నారు. ఎంత చిన్న గ్రామం అయినా కూడా అభివృద్ధి కోసం రూ.50లక్షల కంటే ఎక్కువ నిధులను ఖర్చు చేశామని వెల్లడించారు. తనతో పాటు సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు.
రాష్ట్ర బెవరేజస్ క్పారేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ అన్నారు. ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించలేదన్నారు. రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభంలో భాగంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు, నియోజకవర్గ సమన్వయకర్త దేవీప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై.నరోత్తం, పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, సర్పంచులు అనుసూజమ్మ, తుల్జమ్మ, రాములమ్మ, కల్పన, కృష్ణ, నర్సింహులు, ఎంపీటీసీ బక్కారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ స్రవంతిరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, కలీం, సవూద్, సాలేబాబా, ఆనంద్, నాగరాజు, భూమయ్య, మొల్లయ్య, కరణ్, నర్సింహారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సందీప్, వినోద్, రత్నం, తదితరులు పాల్గొన్నారు.