నర్సాపూర్/శివ్వంపేట, నవంబర్ 1 : మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అటవీశాఖ అర్బన్ ఎకో పార్కు రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటకశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫార్టెస్ అర్బన్ ఎకో పార్కులో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాటేజీలను శనివారం స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి,మెదక్ ఎంపీ రఘునందన్‌తో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక అరుదైన పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు పర్యాటకాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పార్కులో ఏర్పాటు చేసిన వేదికలు, లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్స్ నిర్వహించుకునే ఫెసిలిటీలు, పచ్చదనం లాంటివి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలసి ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన పార్కుగా ఇది రూపుదిద్దుకుందనే అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. మృగవాని రిసార్ట్ సంస్థ వారు పార్కును అభివృద్ధి చేయడం అభినందనీయం అన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. ఎకో పార్కు చెరువు డంపింగ్‌యార్డు కావద్దన్నా రు. గ్రామాలు పిలుస్తున్నాయనే నినాదం రావాలన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గానికి అడవే పెద్ద ఆస్తి అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ హయాం లో అప్పటి సీఎం కేసీఆర్ నర్సాపూర్ ఫారెస్టును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అర్బన్ పార్కుకు నిధులు కేటాయించారని గుర్తుచేశారు. అర్బన్ ఎకో పార్కులో కాటేజీల నిర్మాణంతో నర్సాపూర్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోందన్నారు. చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని, ట్రెక్కింగ్, సఫారీ కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లకుండా అన్ని వసతులు కల్పించేలా ప్రభుత్వం కృషిచేయాలని మంత్రి సురేఖకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
నర్సాపూర్ చెరువుకు నల్లవల్లి-ప్యారానగర్ నుంచి వర్షపు నీరు వస్తాయని, ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే డంపింగ్‌యార్డు ఏర్పాటు ను ప్ర భుత్వం విరమించుకోకపోతే ప్రజలతో కలసి అడ్డుకుంటామని ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ నదీం, రాష్ట్ర అటవీశాఖ ప్ర ధానాధికారి సువర్ణ, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రియా ంక వర్గీస్, కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, మృగవాని గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ ఎండీ విష్ణుచైతన్యరెడ్డి, మెదక్ జిల్లా ఫారెస్టు అధికారి బోజి, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ అరవింద్ పాల్గొన్నారు.