kishan Thanda | రామాయంపేట, జూన్ 05 : తమ తండాలో మద్యం తాగమని.. తాగితే పోలీస్ కేసులు, అమ్మితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని పంచాయతీ కార్యాలయం వద్ద తండావాసులు గురువారం తీర్మాన పత్రం రాసుకుని ఒప్పందం చేసుకున్నారు. తండా వాసులందరూ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని తండాలో మద్యం తాగుతూ ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారని తెలిపారు.
కిరాణా దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి నుండి తండాలో మందు విక్రయిస్తే లక్ష రూపాయలు, తాగితే పోలీస్ కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. ఇక నుండి ఎవ్వరం మద్యం ముట్టమని తీర్మానాలు చేశారు. తండాలో మందు ఎవ్వరు తాగినా పట్టించాలలన్నారు. ఈ విషయమై రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేసి తీర్మాన పత్రం అందజేస్తామని తెలిపారు.
ఈ మేరకు తండావాసులు తీర్మాన పత్రాన్ని సర్పంచ్‌కు అందజేశారు. మూకుమ్మడిగా రామాయంపేటకు చేరుకుని పోలీసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ తండా తాజామాజీ సర్పంచ్ సుభాష్ నాయక్ ఇతర తండా నాయకులు ఉన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు