తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మహిళలు, రైతులు , యువకులు పాల్గొన్నారు. కేకులు కట్ చేయడం, దవాఖానల్లో రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ, అన్నదానం, ఆలయాల్లో పూజలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల యాగాలు నిర్వహించారు. జైకేసీఆర్.. జైజై కేసీఆర్ .. కేసీఆర్ జిందాబాద్.. తెలంగాణ బాపు జిందాబాద్ నినాదాలు మిన్నంటాయి.
గజ్వేల్‌లో..
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు సోమవారం గజ్వేల్‌లో వైభవంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రభుత్వ దవాఖానలో పండ్ల పంపిణీ, ఇంటిగ్రెటేడ్ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ నేతుల అన్నదానం చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, రమేశ్‌గౌడ్, గుంటుక రాజు, రవీందర్, శ్రీనివాస్, చందు, గొడుగు స్వామి తదితరులు పాల్గొన్నారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 17