మనోహరాబాద్, నవంబర్ 1: నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, 60 ఏండ్ల ప్రతిపక్షాల పాలనలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదిన్నరేండ్లలో చేసి గ్రామాలను ఆదర్శంగా నిలిపారని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి తెలిపారు. బుధవారం మనోహరాబాద్ మండలం రామాయిపల్లిలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు రతన్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సీఎం కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ నవనీతశ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సుమన విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు పార్వతీమల్లేశ్, నాగభూషణం, ఉప సర్పంచ్‌లు వెంకటేశ్, ధర్మేందర్, మహేందర్‌గౌడ్, రాజుయాదవ్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు రాహుల్‌రెడ్డి, భిక్షపతి, మైనార్టీ సెల్ మండల నాయకులు జావీద్‌పాషా, ఇర్ఫాన్, ముస్తఫా, నాయకులు పెంటాగౌడ్, శ్రీనివాస్, సాయిరాంగౌడ్, నరేందర్‌గౌడ్, శైలేందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.