రామాయంపేట/ రామాయంపేట రూరల్, అక్టోబర్ 30: మీ ఆడబిడ్డను.. మీ ముందుకు వస్తున్నా.. నన్ను ఆదరించి మరొక్కసారి అసెంబ్లీకి పంపించండి.. ఇప్పటికంటే మరింత మెరుగైన అభివృద్ధి సాధిస్తా.. అని బీఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయంపేట మండలంలోని డీ.ధర్మారం, శివ్వాయపల్లి, సుతారిపల్లి, ఆర్.వెంకటాపూర్, అక్కన్నపేట, తొనిగండ్ల గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పర్యటించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఆలింగనాలు, షేక్హ్యాండ్లు ఇస్తూ తనదైన శైలిలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో వందలాదిగా ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థికి డప్పుచప్పుళ్లు, బోనాల ఊరేగింపులతో ఘన స్వాగతం పలికారు.
ప్రతి మహిళలను పేరుపెట్టి పిలుస్తు బాగున్నావా అవ్వ, అక్క, తమ్ముడు, నాయనా అంటు సంతోషంగా పలుకరించారు. అనంతరం గ్రామాస్తులను ఉద్దేశించి మాట్లాడారు.
రెండు పర్యాయాలుగా తనను రామాయంపేట, మెదక్ ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించారు. అదే ఆదరణతో మీరు గెలిపిస్తే మళ్లీ తాను గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. కొంతమంది దశాబ్దం కింద కనిపించిన వారు స్వార్థం కోసం ఓట్ల అడిగేందుకు మళ్లీ వస్తున్నారన్నారు. వారి మాటలు వింటే మన రాష్ట్రం, మన గ్రామం అభివృద్ధి కాదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన రామాయంపేట మండలాన్ని జీవితాంతం మర్చిపోనన్నారు. అకారణంగా బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. పదేండ్లుగా సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, ఆసరా పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందిస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకోవడం, రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు ఇవ్వద్దని మాట్లాడడం సిగ్గు చేటన్నారు.
ఎన్నికల అనంతరం అర్హులైన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద రూ3వేల పింఛన్, రాష్ట్రంలోని 93 లక్షల మందికి కేసీఆర్ భరోసా పథకాన్ని రూ.5 లక్షల భీమా ఇస్తామన్నారు. అనంతరం జిల్లా ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు స్థానంలేదని, వలసవాదులను ప్రోత్సహించి, డబ్బులకు టికెట్లు అమ్ముకునే నీచమైన సంస్కృతి కాంగ్రెస్‌ది అన్నారు. డీ.ధర్మారం, అక్కన్నపేట గ్రామాల్లోని పలువురు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పార్టీల నాయకులు, బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, వైస్ ఎంపీపీ మస్కుల స్రవంతి, పార్టీ మండల అధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్దిరాంరెడ్డి, సర్పంచ్‌లు బొడ్డు శంకర్, మల్లేశం, రాగి సంధ్య, జంగం నర్సవ్వ, పిట్ల రాణెమ్మ, పంబాల జ్యోతి, చంద్రకళ, శివప్రసాదరావు, సుభాష్‌రెడ్డి, మైలారం శ్యాములు, సురేశ్, రైతుబంధు మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, కార్యకర్తలు నరేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, మానెగల్ల రామకిష్టయ్య, శ్రీకాంత్ సాగర్, దుర్గారెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.