కంటివెలుగుతో ప్రతి ఇంటికీ వెలుగు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు పరీక్షలతో ప్రతి ఇంటికీ వెలుగులు నింపుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేట మండల పరిధిలోని ఏదుల్లాపూర్ గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కల్లూరి కీర్తనాహన్మంతరావుతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
- గురువారం మెదక్ జిల్లాలో 6224 మందికి కంటి పరీక్షలు
- 534 మందికి కండ్లద్దాలు అందజేత
- సంగారెడ్డి జిల్లాలో 16,504 మందికి టెస్ట్‌లు
- 1062 కండ్లద్దాలు అందజేసిన వైద్యులు
శివ్వంపేట/ మెదక్ అర్బన్/ కొల్చారం, ఫిబ్రవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు పరీక్షలతో ప్రతి ఇంటికీ వెలుగులు నింపుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేట మండల పరిధిలోని ఏదుల్లాపూర్ గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కల్లూరి కీర్తనాహన్మంతరావుతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామంలో రెండు రోజులపాటు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీతోపాటు ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, వారి జీవి తాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎం పీపీ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, డీఎస్పీ యాదగిరిరెడ్డి, కౌన్సిలర్ అశోక్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షు రాలు లావణ్యామాధవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నువ్వుల దశరథ, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు లాయక్, డాక్టర్ సంధ్య, నాయకులు బం డారి గంగాధర్, నరేందర్‌రెడ్డి, సూర్యంచౌహాన్, ఉప సర్పంచ్ పాండురంగం, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పరీక్షలు చేయించుకోవాలి : ఎంపీపీ మంజుల
కొల్చారం మండలంలోని రంగపేట గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ బండి సుజాతారమేశ్, ఎంపీపీ మంజులాకాశీనాథ్తో కలిసి ఎంపీడీవో గణేష్శ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకుని దృష్టి లోపాన్ని సవరించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి ఎంతో దూరదృష్టితో ఆలోచించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారనితెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం ఎందరో జీవితాలకు వెలుగులను నింపుతుందన్నారు. రంగంపేట గ్రామంలో 15 రోజులపాటు కంటి పరీక్షలు జరుగుతాయన్నారు. ఎంపీపీ మంజుల మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయిం చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మచ్చ శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు తలారి దుర్గేశ్, నాయకులు బండి రమేశ్, కోరబోయిన కాశినాథ్, రవీందర్‌గౌడ్, సురేశ్, మెడికల్ ఆఫీసర్ హర్షిత, వైద్య సిబ్బంది షఫి, సుదర్శన్, మురళీకృష్ణ, సరోజ, తన్వీర్, మంజుల పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

