ట్రినిడాడ్: వెస్టిండీస్ పర్యటనను పాకిస్థాన్ విజయంతో ముగించింది. రెండు టెస్టుల కోసం ఆ దేశానికి వెళ్లిన పాక్.. తొలి టెస్టులో ఓడినా రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నాలుగో రోజైన బుధవారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు నిర్దేశించిన 75 పరుగుల ఛేదనను పాక్.. 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 387 రన్స్‌కు ఆలౌట్ అయిన పాక్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కరీబియన్ జట్టును 117 పరుగులకే కుప్పకూల్చింది.