గజ్వేల్, ఏప్రిల్ 2: తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదని, ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రూ. లక్ష కోట్లు వృథా అయ్యాయని మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు అసత్యాలు మాట్లాడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, కాళేశ్వరంపై ప్రజలకు ఉన్న ఆలోచన పరిజ్ఞానం ప్రభుత్వాలకు లేకపోవడం బాధాకరమని వంటేరు అన్నారు.
ఎడారిగా ఉన్న తెలంగాణలో నేడు మూడు లక్షల కోట్ల మెట్రి క్ టన్నుల ధాన్యం పండుతుందంటే, దానికి కారణం కేసీఆర్ విజన్‌తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అన్నారు. ఈ రోజు కాలువల్లో పారుతున్న గోదావరి జలాలను చూస్తే ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం గడిచిన పదేం డ్లలో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిందనా అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పు చేసి ఏమీ అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి 16 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు పైసా నిధులు తేలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు రైతు సంక్షేమం పట్టదని, చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ చందనా రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయినర్సిగంరావు, బీఆర్ఎస్ నాయకులు నవాజ్‌మీరా, అత్తెల్లి శ్రీనివాస్, గోలి మమతా సంతోష్, భాగ్యలక్ష్మీ కనకసేనా, మన్నె రూపా వెంకటేశ్, కప్ప మమతాపోచయ్య, శ్రీధర్, కోట బాబు, మురళి, నాయకులు గుంటుక రాజు, స్వామిచారి, శివ, అహ్మద్ పాల్గొన్నారు.