మద్దూరు(ధూళిమిట్ట), జనవరి 18: రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మద్దూరు మండల కేంద్రంలోని తాజ్‌మహల్ గార్డెన్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేక సంతోష్‌కుమార్, మంద యాదగిరి అధ్యక్షతన మద్దూరు, ధూళిమిట్ట మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి రైతు భరోసా పథకాన్ని పక్కనపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఈ-కార్ రేసుతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. కేటీఆర్‌తో పాటు కౌశిక్‌రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించడంపై మండిపడ్డారు. హామీలు అమలు చేయడం చేతకాక బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ సర్కార్ అక్రమంగా కేసులు పెడుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. నీలిమా దవాఖాన ద్వారా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నట్లు గుర్తుచేశారు. నియోజకవర్గ సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో మాజీ ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నాచగోని పద్మావెంకట్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి, దుబ్బుడు వేణుగోపాల్‌రెడ్డి, ముస్త్యాల నాగేశ్వర్రావు, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు వంగ భాస్కర్‌రెడ్డి, చొప్పరి వరలక్ష్మీసాగర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగిటి కమలాకర్, బీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు కర్ర అరుణ, పోగుల మమత, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
హామీల అమలుపై పోరాడుతాం
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల, జనవరి 18: ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు కాంగ్రెస్ సర్కారుపై పోరాడుతామని, రైతులతో పాటు అన్నివర్గాలను కాంగ్రెస్ సర్కారు నిండాముంచిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్ యార్డులో శనివారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాన్ని నిర్వాహకులు అవినీతి లేకుండా నిర్వహించాలన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ సర్కారు రైతులను నట్టేట ముంచిందన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తిస్థ్ధాయిలో చేయకుండా మోసం చేసిందన్నారు.
కేసీఆర్ పాలనలో చినుకుల పడే సమయంలో రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసేవారని, కాంగ్రెస్ వచ్చాక రైతును ఆగమాగం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కంది పంటను అంతర్గత పంటగా సాగు చేసుకున్నారని, కానీ, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది కంది పంటను నమోదు చేయలేదన్నారు. రైతులు తాము పండించిన కందులను విక్రయించుకోవాలంటే వ్యవసాయశాఖ అధికారులు నమోదు చేయలేదు కాబట్టి వారికి ప్రభుత్వ మద్దతు ధర దక్కదని, వెంటనే అధికారులు కంది పంటను నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ అధికారితో ఫోన్లో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణిశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్ మంగోలు చంటి, పీఏసీఎస్ డైరెక్టర్ జ్యోతి మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, ముస్త్యాల బాల్‌నర్సయ్య, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, మాజీ వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, పెడుతల ఎల్లారెడ్డి, పార్టీ టౌన్, మండల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, రంజిత, మానస పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం…
చేర్యాల పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, నాయకులు మంచాల కొండయ్య, ఉట్కూరి అమర్‌గౌడ్, అరిగే కనకయ్య, కోతి దాసు, పచ్చిమడ్ల సిద్దిరాములు, బుడిగె శ్రీనివాస్, భూమిగారి రాజేందర్, అవుశర్ల కిశోర్ పాల్గొన్నారు.
ఉద్యమకారుడికి పరామర్శ
తెలంగాణ ఉద్యమకారుడు పుర్మ దయాకర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన్ను ఎమ్మెల్యే పల్లా పరామర్శించారు. తన దవాఖానలో వైద్యం చేయిస్తానని, అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ టౌన్ సెక్రటరీ బూరగోని తిరుపతిగౌడ్, కందుకూరి సిద్దిలింగం, రవీందర్రావు, పాక బాలయ్య తదితరులు ఉన్నారు.