చేర్యాల, ఆగస్టు 20: ప్రజారంజక పాలన చేసి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థ్ధానంలో నిలిపితే, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను నమ్మబలికి నిండాముంచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో రేణుకా గార్డెన్స్‌లో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తానని బాండ్ పేపర్లు రాసిచ్చిన సీఎం రేవంత్, ఎందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను ముంచిందన్నారు.
రైతులకు యూరియా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని, అన్నిరంగాల్లో సర్కారు విఫలమైందన్నారు.8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, వారికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. నోరు తెరిస్తే అబద్ధ్దాలు మాట్లాడడం, కేసీఆర్‌పై విషం చిమ్మడమే పనిగా సీఎం రేవంత్ పెట్టుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని, తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ క్యాడర్ తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు మూడున్నర లక్షలకోట్ల అప్పు చేస్తే, రెండేండ్లు కాకముందే రేవంత్ సర్కారు రూ. రెండు లక్షల కోట్ల అప్పు చేసిందని, అప్పు చేసిన పైసలతో తెలంగాణలో ఏం అభివృద్ధి పనులు చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, రైతులకు రైతుబంధు ఇచ్చారని, చనిపోయిన రైతుల రైతుబీమా ఇచ్చారని, యాదాద్రి నిర్మించారని, కొత్తగా రోడ్లు నిర్మించారన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏం నిర్మించిందో చెప్పాలన్నారు.తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మేధావులు ప్రశ్నించడం లేదని, పైసలు, పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారని ఆరోపించారు.
నియోజకవర్గంలోని తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లను నింపి చెరువుల్లో నీరు పంపింగ్ చేస్తే రైతులు పంటలు పండించుకునే వారని, కాంగ్రెస్ పార్టీకి ఏం రోగం వచ్చిందో కానీ రిజర్వాయర్లు, చెరువులు ఎండబెట్టిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.రిజర్వాయర్లు నింపి చెరువులకు నీటిని పంపింగ్ చేయాలని తాను విశ్రాంతిలో ఉన్నప్పటికి ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నీటిని పంపింగ్ చేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఇండ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే, తాను పేద వారికి కేటాయించానని గుర్తుచేశారు.
కాంగ్రెస్ వారు ఇచ్చిన ఇండ్ల నిర్మాణాలు 25శాతం ప్రారంభిస్తే, ఎమ్మెల్యేగా తాను మంజూరు చేయించిన ఇండ్లు 95శాతం మంది లబ్ధిదారులు ప్రారంభించినట్లు తెలిపారు.స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గడగడపకూ ప్రచారం చేయాలని, ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సైనికుల వలే పనిచేయాలని పిలుపునిచ్చారు. కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో త్వరగా కొలుకున్నానని, ఇక అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై యుద్ధ్దం చేస్తానని అన్నారు. తన సొంత దవాఖాన నీలిమాలో నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తానని తెలిపారు.
తన విద్యాసంస్థలతో పాటు ఇతర విద్యాసంస్థల్లో సైతం నియోజకవర్గ విద్యార్ధులకు తక్కువ ఫీజులతో అడ్మిషన్లు ఇప్పించినట్లు తెలిపారు. అర్ధరాత్రి ఫోన్ చేసిన తాను అన్ని విధాలుగా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి, ముస్త్యా ల బాల్‌నర్సయ్య, మండల అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, గీస భిక్షపతి, మేక సంతోష్, మంద యాదగిరి, మాజీ ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తన, మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, నాచగోని పద్మవెంకట్గౌడ్, మాజీ చైర్మన్లు అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, సుంకరి మల్లేశంగౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, మంగోలు చంటి, పెడుతల ఎల్లారెడ్డి, చొప్పరి సాగర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గదరాజు చందు, జింకల పర్వతాలు, జంగిటి కమలాకర్, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, పచ్చిమడ్ల మానస, మీస పార్వతి, వకులాభరణం నర్సయ్యపంతులు, దుబ్బుడు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.