సిద్దిపేట, జూలై 31:సాగునీటి కోసం రైతులకు కష్టా లు తప్పడం లేదు. అనుకున్నంతగా వర్షాలు పడక భూగర్భజలాలు పెరగడం లేదు. గతంలో సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ద్వారా పచ్చని పంట పొలాలుగా మారిన భూములన్నీ నేడు బీడుగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగనాయకసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నం గునూరు, సిద్దిపేట అర్బన్ మండలాల్లోని గ్రామా ల్లో చెరువులు నింపారు.
కుడికాలువ ద్వారా చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల్లోని రైతులకు సాగునీటిని అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపలేదు. దీంతో రైతులు వర్షం కోసం మొ గులుకు ముఖం పెట్టే రోజులు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమేర సాగు చేసినప్పటికీ కాళేశ్వరం ద్వారా రంగనాయకసాగర్ నింపి తద్వారా చెరువులు, కుంటలు నింపి సాగునీరు అం దిస్తేనే వ్యవసాయం ముందుకు సాగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.