MLA Mynampally Rohit | మెదక్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : నిరుపేదలకు అండగా నిలబడి, వారికి నిలువ నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రతాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పి సీఈఓ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ మాణిక్యం, డీపీఓ యాదయ్య, అన్ని మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ స్రెకెటరీ, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులతో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు ప్రతాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికి నిలువ నీడను కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందన్నారు. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామం చొప్పున గత జనవరి 26న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిందన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అత్యంత ్రపాధాన్యతనిస్తూ క్ష్రేతస్థాయిలో సదుపాయాలు కల్పిస్తూ ప్రజలలో మమేకమై పనిచేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రాష్టంలో పేదల సొంతింటి కల ఆశయాన్ని సాకారం చేసేందుకుగాను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని ఇల్లు నిర్మించుకునే వారు ఇంటి నిర్మాణ సామాగ్రిని ఒకేసారి కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండలాల ఎంపీడీవోలు పంచాయతీ స్రెకటరీలు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు