హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 16 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకున్న తర్వాతే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలని అర్వో శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్‌ను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికలను బహిష్కరించి కార్యాలయం బయటికి వచ్చి నినాదాలు చేశారు.