హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వరంగల్ ఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ కావ్య రెండుచోట్ల ఎక్స్అఫీషియో మెంబర్‌గా తన పేరు నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకుడు కిషోర్‌గౌడ్, లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి సోమవారం ఎస్ఈసీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కిశోర్‌గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నా రని ఆరోపించారు.
తొర్రూర్‌లో సైతం కాంగ్రెస్ ఇలానే వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. వరంగల్‌లో ఓటు వేసి మళ్లీ రెండో ఓటును తొర్రూర్‌లో వేయడానికి కడియం కావ్య సిద్ధపడటం రాజ్యాం గ విరుద్ధమని అన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని వెంటనే ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కడియం కావ్య వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ తొర్రూర్‌లో కూడా ఎక్స్అఫీషియోగా నమోదు చేయించుకున్నారని, ఇది ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని చెప్పారు.