మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు పాల్గొనగా, ఇప్పటివరకు 1,18,971 మందికి కంటి పరీక్షలు చేశారు. 14,720 మందికి కండ్లద్దాలు అందజేశారు. 13,364 మందికి అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. 21వ రోజు శుక్రవారం జిల్లాలో 6113 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 621 మందికి అద్దాలు అందజేశారు. 571 మందికి అద్దాల కోసం రెఫర్ చేసినట్లు డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 17,528 మందికి కంటి పరీక్షలు చేశారు. జిల్లాలో 69 కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. గ్రామాలకు చెందిన 11506 మంది, పట్టణాలకు చెందిన 4816 మంది, జీహెచ్ఎంసీ పరిధిలోని 1206 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాల్లో 1139 మందికి కండ్లద్దాలు అందజేశారు. 902 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేశారు. 1586 మందికి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు.