EX MLA Kranthi kiran | టేక్మాల్, ఏప్రిల్ 18: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఖాయమని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ఛలో వరంగల్ సభను విజయంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన టేక్మాల్‌లో ఇవాళ రజతోత్సవాల వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ తనదైన శైలితో ముందుకు సాగారని కొనియాడారు.
పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడుస్తున్న ప్రస్తుత తరుణంలో రజతోత్సవాలను నిర్వహించేందుకు పార్టీ వరంగల్ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సంకల్పించిందన్నారు. పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రజతోత్సవాల సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావడానికి సన్నద్ధం కావాలని ఆకాంక్షించారు.
పదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం కోసం..
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం పనిచేసిందని ఆయన గుర్తు చేశారు. స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చి తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు నడిపించిందని తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొలువుదీరిన తెలంగాణ సర్కార్ అన్ని వర్గాల ప్రజలు, రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బీమా, రైతు బంధు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చేదోడుగా నిలవడానికి ఫించన్లను అందిస్తూ వారికి అండగా నిలిచిందన్నారు.
కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దీనస్థితిలో ఉండి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్లపాటు నిర్మాణం చేసిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసిందన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ నెల 27న జరిగే ఛలో వరంగల్ కార్యక్రమానికి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, నాయకులు సిద్దయ్య, రవి, రజాక్, సాయిబాబా, మల్లేశం, సలావోద్దీన్, సాయిలు, సంగయ్య, బాలకృష్ణ, నారాగౌడ్, తదితరులు ఉన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్