Manjira River | పాపన్నపేట, మార్చ్ 18 : గరుడ గంగగా పేరుగాంచిన మంజీరా నదిని కొంతమంది దుర్మార్గులు కలుషితం చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాపన్నపేట మండలం చుట్టూరా మంజీరా నది ప్రవహిస్తుంది. దీనికి ఎంతో చరిత్ర ఉంది, ఏల్లాపూర్, పేరుర్ గ్రామాల మధ్య నుండి మంజీరా ప్రవహించే చోటే సర్పయాగం జరిగిందని ప్రతిదీ.. ఆ యాగం బూడిద ఇప్పటికి ఇక్కడ దొరుకుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇలాంటి చోట ఎవరో గుర్తుతెలియని వారు వైరస్ సోకి మృతి చెందిన వందలాది కోళ్ల కళేబరాలను మంజీరా నదిలో పారబోశారు. దీంతో అవి కుళ్లిపోయి మంజీరా నది కలుషితమయ్యే అవకాశం ఉంది. నీటిని పశువులు తాగడం మూలంగా అవి రోగాల బారిన పడే అవకాశం ఉండడమే కాకుండా చేపలు సైతం చనిపోయే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఈ చనిపోయిన కోళ్ల కళేబరాలను పారవేసిన చోటుకి కొద్ది దూరంలోనే మెదక్ పట్టణానికి మంచినీటిని అందించే వాటర్ ప్లాంట్ సైతం ఉంది. దీంతో పట్టణవాసులు సైతం ఈ నీరుతాగి రోగాల బారిన పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే మంజీరాలో పారవేసిన వేలాది కోళ్ల కళేబరాలు నదిలో నుండి తీసి వేయించి, ఇందుకు కారకులైన వారిని శిక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్