Ration rice | నర్సాపూర్, ఆగస్టు 13 : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సివిల్ సప్లై అధికారులు భారీగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా మేరకు జిల్లా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు, నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డిలతోపాటు సిబ్బంది నర్సాపూర్ బస్ డిపో సమీపంలో లారీలను పట్టుకున్నారు.
ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు బియ్యం తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. సరైన సమాచారం లేకపోవడంతో పూర్తి వివరాల కోసం వేచి చూసిన సివిల్ సప్లై అధికారులు 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి, లింగాపూర్‌లోని తిరుమల రైస్ మిల్లులో భద్రపరిచారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు