మెదక్ : మెదక్ పట్టణంలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో పాటు పలు పార్టీల చెందిన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉంటే డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదన్నారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదలన్నారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.