చేర్యాల, జనవరి 19: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిలో ఆలయంలో ఆదివారం జరిగిన పట్నం వారానికి వచ్చిన భక్తులకు తిప్పలు తప్పలేదు. బస చేసేందుకు గదు లు లభించక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న కాటేజీల్లో డోనర్స్ రావడంతో ఆలయవర్గాలు వారికే గదులను కేటాయించారు. దీంతో సామాన్య భక్తులు ప్రైవేటు గదులను ఆశ్రయించడంతో నిర్వాహకులు ధరలను అమాంతం పెంచారు. గదుల్లో ఉన్న వసతులను బట్టి రూ.10వేల నుంచి 8వేలు, 6వేల వరకు భక్తుల నుంచి వసూలు చేశారు. అంత డబ్బులు భరించలేని భక్తులు క్షేత్రంలోని చెట్ల వద్ద, తాము వచ్చిన వాహనాలు, ఆరుబయట తదితర ప్రదేశాల్లో బస ఏర్పాట్లు చేసుకున్నారు.
నీటి వసతి కల్పించక పోవడంతో ఆలయానికి సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రూ.20 చెల్లించి స్నానాలు చేశారు. మరో రూ.20 చెల్లించి బిందెడు నీరు తెచ్చుకున్నారు. రూ. 50 చెల్లించి డబ్బా తాగునీటిని బసచేసిన ప్రాంతానికి భక్తులు తెచ్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పులు పేరుకు పోవడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. పలువురు దాతలు అన్నదానం చేశారు. భక్తులకు ప్లాస్టిక్ ప్లేట్లలో ప్రసాదం, పాయసం, అన్నం అందజేశారు. వాటిని తిన్న అనంతరం కొందరు భక్తులు అక్కడే పడేయగా, మరికొందరు భక్తులు ఇతర ప్రదేశాల్లో ప్లేట్లు పడేయడంతో పరిసరాలు చెత్తమయంగా మారాయి. టెంకాయల విక్రయదారులు రూ.40కి ఒకటి చొప్పున విక్రయించారు. తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్టకు వెళ్లిన భక్తుల నుంచి క్షురకులు రూ. 100, రూ.50 వసూలు చేశారు.
మంత్రుల సమీక్షించినా…
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం, భక్తులకు సకల సౌకర్యా లు కల్పిస్తామని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో నిర్వహించిన సమీక్షల్లో పలుమార్లు ప్రకటించారు. కానీ, ఆదివారం ఆ పరిస్థితి కనిపించలేదు. భక్తులకు గదులు లభించలేదు. దర్శనానికి గంటల పాటు క్యూలో నిలబడాల్సి వచ్చింది. కోనేరు లో నీరు మురికిగా మారడంతో భక్తులు అసౌక్యానికి గురయ్యారు. కోనేరులో నీటిని శుద్ధిచేసే యంత్రం అలంకారప్రాయంగా మారిం ది. అన్నదాన సత్రం తదితర ప్రదేశాల్లోని షవర్ల వద్ద మహిళలు స్నానాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షవర్ల వద్ద ఎలాంటి పరదాలు ఏర్పాటు చేయలేదు.
శీఘ్ర దర్శనం, కోనేరులో నీరు శుభ్రత, భక్తులకు భోజనం, తాగునీటి వసతి తదితర వసతులు కల్పించడంలో ఆలయ పాలక మండలి విఫలమైనట్లు భక్తులు ఆరోపించారు. కొంద రు పాలక మండలి సభ్యులు ఆలయ ప్రసాదాల శాలలోని ఓ గదిలో కూర్చుని దర్శనం పాస్‌లు ఇచ్చే పనిలో నిమగ్నం కావడం విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో విధులు నిర్వహించిన పాలకమండలి సభ్యులు దర్శ నం పాస్‌లను అధికారులకు అప్పగించి, వారు ఇతరత్రా పనులు చూసుకునేవారని, ప్రస్తుత పాలక మండలి సభ్యులు భక్తులకు సేవలు అందించడంపై దృష్టిసారించడం లేదనే విమర్శలు ఉన్నాయి.