Hello BC Chalo Delhi | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 29 : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశంలోనే ప్రవేశ పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బిల్లును ఆమోదింప జేసి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న పోరుగర్జనకు సంబంధించి ఇవాళ జిల్లా కేంద్రంలో ‘హలో బీసీ చలో ఢిల్లీ’ పోస్టర్‌ను జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు గంగారాం, బీసీ సంఘం నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిధి గృహంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పోరుగర్జన కార్యక్రమానికి పార్డీలకు అతీతంగా బీసీలమంతా తరలి వెళ్దామన్నారు. రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే బిక్షం కాదని ఇది బీసీల సామాజిక హక్కు అన్నారు. బీసీలమంతా ఏకమై మన హక్కులను సాధించుకుందామన్నారు. జిల్లాలోని బీసీలు ఐక్యంగా తరలి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమరి శ్రీనివాస్, చింతల నర్సింలు, శంకర్‌గౌడ్, రమేశ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.