శివ్వంపేట, మే 19: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శివ్వంపేట కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై కవర్లు కప్పడంతో పాటు నీరు నిల్వకుండా పక్కకు వెళ్లేందుకు రైతులు పారలతో కాలువలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్రాల్లో ధాన్యం త్వరగా కొనుగోలు
చేయాలని రైతులు అధికారులను వేడుకుం టున్నారు. లేకపోతే తాము తీవ్రంగా నష్ట పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.