సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో ఆదివారం నిజాంపేట మండలం వెంకటాపూర్(కే)కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
-నిజాంపేట, జూలై 2
నిజాంపేట, జూలై 2: మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ చెందిన 21 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నేత దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి పనులు చూసి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో నార్లపూర్ సర్పంచ్ అమరసేనారెడ్డి, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు మావురం రాజు, బీఆర్ఎస్ నాయకులు దయాకర్, ధర్మారెడ్డి,నందు, పెంటయ్య తదితరులు ఉన్నారు.