మునిపల్లి, జూన్ 13: అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటిన హరితహారం మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. నాడు ప్రతిష్టాత్మకంగా నాటిన మొక్కలను అధికారులు గాలికి వదిలేయడంతో నేడు అవి ఎండిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులు నిద్రమత్తులో వాటిని పట్టించుకోవడం లేదు. నిత్యం మునిపల్లి-బుధేరా రోడ్డుపై అధికారులు విధులకు వెళ్తుంటారు. కానీ వారికి రోడ్డు పక్కన ఎండిపోతున్న హరితహారం మొక్కలు మాత్రం కనిపించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.