సిద్దిపేట, జూన్ 8: సిద్దిపేటలో జూలై 28న ద్వితీయ ఎడిషన్ హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి అన్నారు. రెండో హాఫ్ మారథాన్ ఆన్లైన్ లింకును మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబా ద్లో ఆవిషరించారు.
సిద్దిపేట ప్రజలు సెకండ్ ఎడిషన్ హాఫ్ మారథాన్‌లో పాల్గొని విజయవంతం చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమాలు తలపెట్టినప్పుడు విజయవంతం కావడానికి సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, కోచ్ నిరంజన్, మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, నిఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.