పెద్దశంకరంపేట, ఏప్రిల్17: హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కోకాపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారని, అందుకు ఆపార్టీపై విరక్తిచెంది బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. మండలపరిధిలోని శివయపల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లేశం, వెంకటేశం, వార్డు సభ్యులు నర్సింహులు, కుక్కల బేతయ్య, ప్రవీణ్, రత్నయ్య, రాములు తదితరులు చేరారు.
బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి.. : మండలంలోని కట్టెల వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెరమాండ్ల భానుతో పాటు పలువురు బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల నాయకులు సురేశ్‌గౌడ్, బూత్కూరి సుభాశ్, దత్తు, కోనం అంజయ్య, శంకర్‌గౌడ్, అంజయ్య, శ్రీనివాస్, మల్లేశం, చంద్రకాంత్ పాల్గొన్నారు.