ద్దిపేట, డిసెంబర్ 15: బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, వినూత్న కార్యక్రమాలు అమలై తెలంగాణ పల్లెలు కేంద్రం నుంచి అవార్డులు పొందాయని, ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని.. గ్రామాల అభివృద్ధిపై కొత్త సర్పంచ్‌లు దృష్టిపెట్టాలన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను గాలికి వదిలేసిందన్నారు.

ఈ జీపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అద్భుత విజయాలు సాధించారని, గ్రామాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..సిద్దిపేట నియోజకవర్గంలో 91 గ్రామ పంచాయతీలకు 77 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగి పరిఢవిల్లిన పల్లెలు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దయనీయంగా మారాయన్నారు. అపరిశుభ్రత, పారిశుధ్యం సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని, అవార్డుల పల్లెలుగా చేసుకున్నామని గుర్తు చేశారు. కా ంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు.

రెండేండ్లలో రాష్ట్రానికి ఒక అవార్డు రాలేదన్నారు. కొత్త జీపీ పాలకవర్గాలు అభివృద్ధిలో, అవార్డులు సాధించడంలో పోటీపడాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని, గ్రామాల సమగ్రాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. నేడు కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లతో కాలువలు పారుతున్నాయంటే అదం తా కేసీఆర్ ఘనతే అని హరీశ్‌రావు అన్నా రు.
కాళేశ్వరం, మిష న్ భగీ రథ ప్రాజెక్టులకు స్ఫూర్తి సిద్దిపేట అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సిద్దిపేట నియోజకవర్గ జీపీలు 60 జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించాయని, ఆదర్శ గ్రామాలు గా తీర్చిదిద్దడంలో సర్పచ్‌లు కృషి చేయాల ని హరీశ్‌రావు అన్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారని, సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ గెలవలేదన్నారు. కాంగ్రెస్ ఏం చేయడం లేదనే ప్రజలు ఇలాం టి తీర్పు ఇచ్చారని, ఎన్నికల్లో గెలుపోటము లు సహజమన్నారు. గెలిచినా ఓడినా గ్రామా ల అభివృద్ధి లో భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని, కొత్త గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు హరీశ్‌రావు హామీ ఇచ్చారు. కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో సిద్దిపేటలోని హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్ కొలాహలంగా మారింది. వేలా ది మందితో కిటకిటలాడింది. గెలిచిన సర్పం చ్ లను పేరుపేరునా హరీశ్‌రావు అభినందించారు. అందరికీ స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.