పటాన్చెరు, జూన్ 26: బీఆర్ఎస్ పోరాటంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా జమచేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం, జిన్నారం మండలాల రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, తెల్లాపూర్ మాజీ వైఎస్ చైర్మన్ రాములుగౌడ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ జిన్నారం మండల అధ్యక్షుడు రాజేశ్, గుమ్మడిదల మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు ఐలాపూర్ మాణిక్‌యాదవ్, సాయి చరణ్‌గౌడ్ పాల్గొన్నారు.