జిన్నారం, జనవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం మాజీ సర్పంచ్ సురేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో వంద మంది యువకులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన యువకులు, ఇతర పార్టీల నాయకులకు హరీశ్‌రావు కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక ఆపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రూపొందించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్‌గౌడ్, గణేశ్, రామచందర్‌గౌడ్, భగవాన్‌సింగ్, రాజుగౌడ్, అశోక్, దుర్గయ్య, మల్లేశ్, రాములు, విక్రంసింగ్, రాహుల్‌సింగ్, భోగరాజు, నవీన్‌యాదవ్, వినయ్‌యాదవ్, రాము ముదిరాజ్, సుభాష్, బీరప్పయాదవ్, సురేశ్‌యాదవ్, కృష్ణ, అనిల్, శ్రీకాంత్, శ్రీనివాస్, మనోజ్ పాల్గొన్నారు.