మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 9: మెదక్ బల్దియాలో బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, సుమారు రూ. 60 కోట్లతో మెదక్ పట్టణంలో ఇంటింటికీ స్వచ్ఛమైన భగీరథ తాగునీరు అందించి అక్కాచెల్లెళ్ల కష్టాలు తీర్చామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం మెదక్ పట్టణంలో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మెదక్‌లో విశాలమైన రోడ్లు, సెంట్ర ల్ లైటింగ్, ఏర్పాటు చేశామన్నారు. మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మాతా శిశు సంరక్షణ దవాఖాన నిర్మించినట్లు తెలిపారు.

రైలు తెచ్చుకున్నామని, మెడికల్ కళాశాల తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో మెదక్‌కు ఇక్కడి ఎమ్మెల్యే, ప్రభుత్వం చేసిందమేటో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనేక హామీలిచ్చి మోసం చేసిన వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికలు మెదక్ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినవని, మంచిగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. మరో రెండేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. అప్పుడు మరింతగా అభివృద్ధి చేసుకుందామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మెదక్‌లో షాదీఖానా, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు.
మెదక్ ఎమ్మెల్యే చాలా గొప్పోడు.. రోజుకు 24 గంటలు ఉంటే, ఎన్నికల సమయంలో రైతులకు 25 గంటలు కరెంట్ ఇస్తామని మెదక్ ఎమ్మెల్యే అన్నాడని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కనీసం 12 గంటలైనా ఇవ్వడం లేదని వి మర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వారిని గెలిపించుకోకుంటే బిల్లులు రావని బెదిరిస్తున్నారట.. నీ పిట్ట బెదిరింపులకు, చిల్లర బెదిరింపులకు ఎవరూ భయపడరని, బిల్లు లు మీ జేబుల నుంచి ఇస్తున్నారా ? మీ జాగీరా ? బరాబర్ బిల్లులు వస్తాయి, కొట్లాడి సాధించుకుంటామని హరీశ్‌రావు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మెదక్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తారని ఇక్కడి నాయకులు ప్రచారం చేశారని, మరి ఎందుకు రాలేడో వారే చెప్పాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకుల ఆరాచకాలను అందరూ గమనిస్తున్నారని, వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు. రెండేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, బీఆర్ఎస్ శ్రేణులను వేధించిన వారిని గుర్తుపెట్టుకుని మరీ భరతం పడతామని హరీశ్‌రావు హెచ్చరించారు. కార్నర్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యీ సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, సురేందర్‌గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో మెదక్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్సీ, ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్ హుస్సేన్ అ న్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి మ రిచి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బలాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు జంకుతున్నారని, మెదక్ బల్దియాపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
-మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమై పోతామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మీ ఓటు ద్వారానే కాం గ్రెస్‌కు తగిన శాస్తి జరగలన్నారు. కేసీఆర్ హయాంలో మెదక్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పైసా నిధు లు రాలేదన్నారు. మెదక్‌లోని ప్రధాన కూడళ్లను నేటికీ ఆధునీకరించ లేకపోయారని విమర్శించారు. కాంగ్రె స్ నాయకుల భయబ్రాంతులు, బె దిరింపులకు ఎవరూ భయపడారని, బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటేసి గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు.
-బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి