గుమ్మడిదల, డిసెంబర్ 8: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావు సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ను వీడిన నేతలు తిరిగి సొంతగూటికి చేరారు. నాయకులతో పాటు మరో 50 మంది వరకు ఆయా గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్కు గుమ్మడిదల మండలం కంచుకోట అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గుమ్మడిదల మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ హయాం లో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, రవీందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఫయాజ్, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మురళి, మంగయ్య పాల్గొన్నారు.