జగదేవపూర్, సెప్టెంబర్14: బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ దశదిన కర్మ సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లోని కేశిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించారు.
మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఫరూఖ్హుస్సేన్, కర్నె ప్రభాకర్, వంటేరు యాదవరెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, గెల్లు శ్రీనివాస్,
రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి, పలువురు మాజీ జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు వజ్రమ్మ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసుశ్రీనివాస్, స్థానిక నాయకులు చంద్రశేఖర్, బుద్దనాగరాజు, కొత్తకవిత, బాలేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.