కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో.. ప్రజల బతుకులు ఆగం
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రజల బ్రతుకులు అగమ్యగో చరంగా మారాయని, తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పల్లె సు భిక్షంగా ఉన్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఆచరణలో సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
- బీఆర్ఎస్ పాలనలో సుభిక్షం
- జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
- వట్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
- అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని పిలుపు
- కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని పిలుపు
అందోల్/ వట్పల్లి, అక్టోబర్ 4 : కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రజల బ్రతుకులు అగమ్యగో చరంగా మారాయని, తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పల్లె సు భిక్షంగా ఉన్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఆచరణలో సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ఇచ్చే హామీలను అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయాలని సవాల్ విసిరారు. జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డితో కలిసి వట్పల్లి, పాలడ్గు, షాద్‌నగర్(గట్పల్లి) గొర్రెకల్, నాగులపల్లి, నిర్జెప్ల, మర్వెల్లి, గౌతాపూర్ గ్రామాల్లో బుధవారం పర్యటించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కార్యాలయాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభు త్వంలో మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. పల్లెప్రగతి ద్వారా ప్రతి గ్రామా నికి మౌలిక సదుపాయాలు సమకూరయని తెలిపారు. పాలడ్గులో వాటర్‌ట్యాంక్‌ను ప్రారంభించి, షాద్‌నగర్‌లో పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అ నంతరం బతుకమ్మ చీరలు, గృహలక్ష్మి ప్రొసీడింగ్ పేపర్లు అందజేశారు.
మండలకేంద్రం వట్పల్లిలో ఎమ్మార్సీ భవ నం, వాటర్‌ట్యాంక్ ప్రారంభించారు. రైతువేదికలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో గృహలక్ష్మి ప్రొసిడింగ్ పేపర్లు, బతుకమ్మ చీరలు, యువకులకు క్రికెట్ కిట్లు, ఇతర ఆట పరికరాలు, పొదుపు సంఘాలకు ఫ్యాన్లు అందజేశారు. గొర్రెకల్‌లో సీసీరోడ్డు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పను లను ప్రారంభించి, మహిళలకు చీరలను అందజేశారు. నాగులపల్లి, పల్వట్లలో సీసీ రోడ్లు, ఇతర పనులు ప్రారంభించి మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు గృహలక్ష్మి పత్రాలు, క్రీడాపరికరాలు అందజేశారు. నిర్జప్లలో ‘ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, సీసీరోడ్లు, కేసీఆర్ ఫంక్షన్‌హాల్ ప్రారంభించారు. నిర్జప్లలో సర్పంచ్ నందినీవీరారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపిస్తు స్వాగతం పలికారు. గౌతాపూర్, మర్వెల్లి గ్రా మాల్లో సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయలు
వట్పల్లి మండలం నిర్జేప్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వరం చైర్మన్ వీరారెడ్డి ఆధ్వర్యం లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. బీఆర్ఎస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రేడ్‌ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, డిక్కీ సౌత్ ఇండియావైస్ ప్రెసిడెంట్ రాహుల్‌కిరణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ రజినీకాంత్, ఎంపీపీ కృష్ణవేణి, రైతుబంధు మండలాధ్యక్షుడు అశోక్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వినోద్‌గౌడ్, వైస్‌ఎంపీపీ నాగరాణీబస్వరాజ్, ఎంపీటీసీలు నర్సింహులు, కవితాగోపాల్రెడ్డి, సుజాతా ఎల్ల య్య, సర్పంచ్‌లు సురేఖాబు ద్ధిరెడ్డి, రమేశ్, నారాయణగౌడ్, ఖయ్యుంపాషా, నవనీతాసుభాశ్గౌడ్, శోభారాణిసంతోశం, విజయ్, నాయకు లు పల్వట్ల జగదీశ్వర్, వీరే శం, సుభాశ్, మల్లేశం, రాజేశ్వర్‌గౌడ్, నరేశ్‌గౌడ్, మధు, శ్రీనివాస్‌గౌడ్, నాగరాజు, యా దగిరి, ప్రకాశం, మహేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

