మెదక్ రూరల్, జూన్07 : దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మండల పరిధిలోని కొంటూర్ గ్రామంలో దళిత బంధు పథకంలో భాగాంగా ఇద్దరు లబ్ధిదారులకు రెండు యూనిట్లు బర్రెల షెడ్డుకు ఎమ్మెల్యే భూమిపూజా చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకువచ్చారని అన్నారు. తదళితుల అభ్యున్నతికోసం ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ యమున, వైస్ ఎంపీపీ ఆంజనేయులు , మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, ఎంపీడివో శ్రీరాములు, సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ ప్రభకర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కిష్టయ్య , సర్పంచులు సిద్దగౌడ్ , ప్రభాకర్ ,నర్సింలు,మెదక్ ఆత్మకమిటీ చైర్మన్ ఆంజాగౌడ్ , తదితరులు పాల్గొన్నారు.